అక్రమాస్తుల కేసులో షరతులతో కూడిన బెయిల్ పై బయటకు వచ్చిన వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, ఆ షరతులను ఉల్లంఘించి కేసును ప్రభావితం చేసే ప్రయత్నం చేశారు కనుక అయనకిచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని సిబిఐ అధికారులు సిబిఐ కోర్టులో ఒక పిటిషన్ వేశారు. దానిపై ఈరోజు సుమారు 4 గంటలపాటు విచారణ జరిగింది. ఇరు పక్షాల వాదనలు విన్న తరువాత ఈ కేసుపై ఈనెల 28న తీర్పు చెపుతామని కేసును వాయిదా వేసింది. ఒకవైపు జగన్ బెయిల్ ను రద్దు చేసి మళ్ళీ జైలుకు పంపాలని సిబిఐ వాదిస్తుంటే, వచ్చే నెల 15వ తేదీ నుండి రెండు వారాలపాటు తన కుటుంబంతో కలిసి న్యూజిలాండ్ లో పర్యటించి వచ్చేందుకు అనుమతించవలసిందిగా కోరుతూ జగన్ పిటిషన్ వేయడం విశేషం. దానిపై కూడా సిబిఐ న్యాయవాది నరేందర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జగన్ దేశం విడిచి బయటకు వెళ్ళేందుకు అనుమతించరాదని ఆయణ కోర్టును అభ్యర్ధించారు. ఈ పిటిషన్ పై కూడా ఏప్రిల్ 28న నిర్ణయం చెపుతామని కోర్టు తెలిపింది.
ఒకవేళ జగన్ బెయిల్ ను సిబిఐ కోర్టు రద్దు చేయకపోతే సమస్య లేదు కానీ రద్దు చేస్తే వెంటనే హైకోర్టుని ఆశ్రయించక తప్పదు లేకుంటే న్యూజిల్యాండ్ కు బదులు మళ్ళీ జైలుకు వెళ్ళవలసిరావచ్చు.