ఇక 4 ఏళ్ళ వరకూ ఆయనే అధ్యక్షుడు

వరుసగా 8వ సారి తెరాస అధ్యక్షుడుగా ఎన్నికైన కేసీఆర్ ఈరోజు కొంపల్లిలో జరిగిన పార్టీ ప్లీనరీ సమావేశాలలో పార్టీకి సంబంధించి రెండు కీలక మార్పులు చేస్తున్నట్లు ప్రకటించారు. తెరాస అధ్యక్ష పదవీ కాలం ప్రస్తుతం ఉన్న రెండేళ్ళ నుంచి నాలుగేళ్ళకు పెంచుతున్నట్లు ప్రకటించారు. కనుక మరో నాలుగేళ్ళవరకు అంటే 2021 వరకు కేసీఆర్ తెరాస అధ్యక్షుదిగా కొనసాగుతారన్న మాట. జిల్లా స్థాయి పార్టీ కమిటీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక నుంచి అసెంబ్లీ నియోజక స్థాయి కమిటీలు మాత్రమే ఉంటాయని ప్రకటించారు. 

ఈరోజు సాయంత్రం ప్లీనరీ ముగింపు సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, “మా ప్రభుత్వం చాలా పారదర్శకంగా, అవినీతికి వ్యతిరేకంగా పనిచేస్తోంది. కనుక ఇకపై మా ప్రభుత్వంపై ఎవరైనా నిరాధారమైన ఆరోపణలు చేస్తే వారు తప్పనిసరిగా వాటికి ఆధారాలు చూపి నిరూపించాలి లేకుంటే వారిపై కేసులు పెట్టడానికి కూడా వెనకాడము,” అని హెచ్చరించారు.