ఇక పోస్టాఫీసుల ద్వారా పెన్షన్లు

రాష్ట్రంలో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఇంకా అనేకమంది నిస్సహాయులకు తెలంగాణా ప్రభుత్వం ఆసరా పధకం క్రింద బ్యాంకుల ద్వారా పెన్షన్లు అందజేస్తోంది. కానీ ఇటీవల బ్యాంకుల నుంచి డబ్బు తీసుకోవడంలో సమస్యలు ఎదురవుతున్న కారణంగా వచ్చే నెల నుంచి  పోస్టాఫీసుల ద్వారా పెన్షన్లని అందజేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఐరిస్ లేదా బయోమెట్రిక్ విధానం ద్వారా లబ్దిదారులకు పెన్షన్లు అందజేయాలని నిర్ణయించింది. నిధులు విడుదల చేసిన 10 రోజులోగానే పెన్షన్లు పంపిణీ ప్రక్రియ పూర్తి చేసేవిధంగా అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రాష్ట్ర పోస్ట్ మాస్టర్ జనరల్ ఎలిషాను కోరారు. 

రాష్ట్రంలో అన్ని వర్గాల పెన్షనర్లు కలిపి మొత్తం 3,60,405 మంది ఉన్నారు. ఒంటరి మహిళలకు కూడా పెన్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది కనుక ఈ సంఖ్య ఇంకా మరికొంత పెరిగే అవకాశం ఉంది.