సింగరేణికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

సింగరేణి కార్మికులకు సుప్రీంకోర్టులో కూడా ఎదురుదెబ్బ తగిలింది. వారికి వారసత్వ ఉద్యోగాలను కల్పిస్తూ  తెరాస సర్కార్ ఇచ్చిన జీవోపై హైకోర్టు స్టే విదించిన సంగతి తెలిసిందే. సింగరేణిలో ఉద్యోగులు అందరికీ గంపగుత్తగా వారసత్వ ఉద్యోగాల సౌకర్యం కల్పించడం సరికాదని, ఎవరైనా కార్మికుకు అనారోగ్య కారణాల చేత పదవీ విరమణ చేస్తున్నట్లయితే వారు మాత్రమే తమ ఉద్యోగాలను తమ పిల్లలకు బదిలీ చేసుకోవచ్చని హైకోర్టు తీర్పు చెప్పింది. 

హైకోర్టు తీర్పుపై సింగరేణి కార్మిక సంఘాలు సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకొన్నాయి. ఇవ్వాళ్ళ వారి పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పునే సమర్ధించింది. అంటే ఇక వారికి వారసత్వ ఉద్యోగాల అవకాశం లేనట్లేనని చెప్పవచ్చు. కనుక ఈ సమస్యను ఏదో విధంగా పరిష్కరించవలసిన బాధ్యత తెరాస సర్కార్ దే.