సంబంధిత వార్తలు
తెదేపా సీనియర్ నేత దేవినేని నెహ్రు సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్ కేర్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధి బాధపడుతున్నారు.
దేవినేని నెహ్రు విజయవాడ రాజకీయ నేతలలో ప్రముఖులు. కొన్ని నెలల క్రితమే ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి తెదేపాలో చేరారు. ఆయన వరుసగా ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన గతంలో ఎన్టీఆర్ హయంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొన్ని రోజుల క్రితమే తెదేపాలో చేరారు. ఆయనకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.