నల్లగొండ ఆర్టీసీ ఉద్యోగులు మెరుపు సమ్మె

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆర్టీసీఉద్యోగులు శనివారం మెరుపు సమ్మె మొదలు పెట్టారు. రోజుకి 8 గంటలకు బదులు 12గంటలు పనిచేయమని, అదనపు కిమీ తిప్పాలని డిపో మేనేజర్లు తమపై ఒత్తిడి చేస్తున్నారని, ఆ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్ లు ఇతర సిబ్బంది ఈరోజు తెల్లవారుజాము నుంచి సమ్మె మొదలుపెట్టారు. దీనితో 7 ఆర్టీసీ డిపోలలో బస్సులు ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయి. ఆర్టీసీ బస్సులు తిరుగకపోవడంతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. నల్లగొండ, సూర్యాపేట, భువనగిరి, నకిరేకల్, మునుగోడు, కోదాడ, మిర్యాలగూడ తదితర ప్రాంతాలలో బస్సులు నిలిచిపోయాయి. ఆర్టీసి డిపో మేనేజర్లు తమ సమస్యలను పరిష్కరిస్తే గానీ సమ్మె విరమించేది లేదని ఉద్యోగులు చెపుతున్నారు.