ఆ రోజుల్లో శలవులుండవుట!

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి రోజుకొక సంచలన నిర్ణయం ప్రకటిస్తూ అందరినీ ఆకర్షిస్తున్నారు. అదే కారణంగా విమర్శకులకు కూడా పనికల్పిస్తున్నారు. ఈరోజు బాబా అంబేద్కర్ జయంతి సందర్భంగా ఒక ముఖ్యప్రకటన చేశారు. ఇక నుంచి మహనీయుల జయంతి దినాల సందర్భంగా రాష్ట్రంలో పాఠశాలలకు శలవులు ఉండవని ప్రకటించారు. ఆరోజున ఆ మహానీయుల గొప్పదనం గురించి పిల్లలకు తెలియజేయడం ద్వారా వారిలో స్ఫూర్తి రగిలించే గొప్ప అవకాశాన్ని శలవులు కారణంగా కోల్పోవడం సరికాదనే అభిప్రాయంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి చెప్పారు. నిజమే కదా!