చారిత్రిక కట్టడాల కోసం హెరిటేజ్ చట్టం తెస్తాం

ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈరోజు మంత్రివర్గ సమావేశం జరిగింది. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ  ఇదివరకున్న  హెరిటేజ్ చట్టంలో చాలా లోపాలున్నాయని రాష్ట్రంలో ఉన్న చారిత్రిక ప్రాధాన్యత గల అన్ని కట్టడాలను కాపాడుకోవడానికి హెరిటేజ్ యాక్ట్ రూపొందిస్తామని చెప్పారు. తెలంగాణా చరిత్రకు, సంస్కృతికి అద్దంపట్టే వాటన్నిటినీ చారిత్రిక కట్టడాల జాబితాలో చేర్చుతామని చెప్పారు. గతంలో ఉన్న హెరిటేజ్ చట్టంలో వనపర్తి కోట, దోమకొండ గడీ వంటి అనేక కట్టడాలకు చోటు కల్పించకపోవడం వలన వాటికి రావలసినంత గుర్తింపు రాలేదని కేసీఆర్ అన్నారు. తాము తేబోయే హెరిటేజ్ చట్టంలో హైదరాబాద్ తో సహా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో గల చారిత్రిక ప్రాధాన్యత గల కట్టడాలను చేర్చుతామని  కేసీఆర్ అన్నారు.