తెలంగాణా రైతన్నలకు శుభవార్త!

తెలంగాణా రైతన్నలకు తుది విడత పంటరుణాల మాఫీకి రూ.4000 కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర ఆర్ధికశాఖ నిన్న ఉత్తర్వులను జారీ చేసింది. వ్యవసాయ శాఖ అనుమతించగానే అవి రైతుల బ్యాంక్ ఖాతాలలో చేరుతాయి. ఆర్ధిక శాఖా విడుదల చేసిన ఈ మొత్తంలో వ్యవసాయ శాఖకు రూ. 2957.47 కోట్లు, ఎస్సీ ప్రత్యేకాభివృద్ధి నిధికి రూ.656.62 కోట్లు, ఎస్టీ ప్రత్యేకాభివృద్ధి నిధికి రూ. 385.90 కోట్లు కేటాయించబడ్డాయి. 

దీనితో తెరాస ఇచ్చిన ఒక ఎన్నికల హామీని పూర్తిగా నేరవేర్చినట్లయింది. రాష్ట్రంలో మొత్తం 35.3 లక్షల మంది రైతులకు తెరాస సర్కార్ రూ.1లక్షలోపు పంట రుణాలను మాఫీ చేసింది. ఈసారి ఖరీఫ్ సీజన్ మొదలవడానికి రెండు నెలల ముందుగానే తుది విడత నిధులను విడుదల చేస్తుంనందున, ఇది రైతులకు చాలా ఉపయోగపడుతుంది.    

తెరాస సర్కార్ 2014-15 ఆర్ధిక సం.లో రూ.4,040 కోట్లు, ఆ తరువాత వరుసగా రూ.4,037 కోట్లు, రూ.4,025, మళ్ళీ ఇప్పుడు రూ.4000 కోట్లు విడుదల చేసింది.