ఏప్రిల్ 16వ తేదీ ఒక్కరోజు తెలంగాణా శాసనసభ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని తెరాస సర్కార్ భావిస్తోంది. ఈ సమావేశంలో జి.ఎస్.టి.బిల్లు, ముస్లిం మరియు గిరిజనుల రిజర్వేషన్ బిల్లులను ఆమోదించాలని తెరాస సర్కార్ భావిస్తోంది. రిజర్వేషన్ల కల్పనకై అధ్యయనం చేసిన బీసి కమీషన్ తన నివేదికను మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందజేసింది. వెంటనే ఆయన శాసనసభ ప్రత్యేక సమావేశం నిర్వహించడానికి గవర్నర్ నరసింహన్ అనుమతి కోరినట్లు సమాచారం. జి.ఎస్.టి.బిల్లు అమోదానికైతే ఒక్కరోజు సమావేశం నిర్వహించినా సరిపోతుంది కానీ వివాదాస్పదమైన ముస్లింలు, గిరిజనుల రిజర్వేషన్ల బిల్లులపై చర్చించి ఆమోదించడానికి కనీసం 4-5 రోజులైనా సమయం అవసరం ఉంటుంది. కనుక ఒక్కరోజు సమావేశనికి ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేయవచ్చు.