షిరిడి సాయి భక్తులకు శుభవార్త

షిరిడిసాయి భక్తులకు శుభవార్త. షిరిడి సమీపంలో గల అహ్మద్ నగర్ లో నిర్మించబడుతున్న విమానాశ్రయానికి మే నెల నుంచి విమానసేవలు ప్రారంభం కాబోతున్నాయి. మొదట హైదరాబాద్, ముంబై, డిల్లీ, కోల్ కతా, మద్రాస్ తదితర నగరాల నుంచి షిరిడికి విమానసేవలు ప్రారంభం అవుతాయి. షిరిడికి ఎలాగూ దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి భక్తులు బారీ సంఖ్యలో తరలి వస్తుంటారు కనుక ప్రైవేట్ ఎయిర్ లైన్స్ సంస్థలు పోటాపోటీగా షిరిడికి విమానాలను నడిపించడం ఖాయం. తరువాత డిమాండ్ ఉన్నట్లయితే విదేశాల నుంచి కూడా షిరిడికి విమానాలు నడిపించవచ్చు. షిరిడిలో విమానాశ్రయం ఏర్పాటుకావడం వలన దూర ప్రాంతాల నుంచి షిరిడి వెళ్ళే భక్తులకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.