చెన్నైలో ఏమిటీ వింత?

తమిళనాడు రాజధాని చెన్నైలో అన్నాసాలై అనే ప్రాంతంలో రెండు రోజుల క్రితం అకస్మాత్తుగా రోడ్డు కృంగిపోయి పెద్ద గొయ్యి ఏర్పడటంతో ఆ రోడ్డుపై ప్రయాణిస్తున్న ఒక బస్సు, ఒక కారు దానిలో పడిపోయాయి. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరుగలేదు..ఎవరూ పెద్దగా గాయపడలేదు. మళ్ళీ ఇవ్వాళ్ళ అదే ప్రాంతంలో మరోచోట రోడ్డుపై పెద్దపెద్ద పగుళ్ళు ఏర్పడ్డాయి. ట్రాఫిక్ పోలీసులు వాటిని సకాలంలో గుర్తించి ట్రాఫిక్ ను మరో వైపు మళ్ళించడంతో మరో ప్రమాదం తప్పింది. చెన్నైలో భూగర్భమెట్రో రైల్ నిర్మాణం కోసం తవ్వుతున్న సొరంగం వలననే భూమి క్రుంగిపోతోందని అనుమానిస్తున్నామని మెట్రో అధికారులు చెప్పారు. ఆ ప్రాంతంలో భూమిలోని మట్టి వదులుగా ఉన్నందునే క్రుంగిపోతోందని చెప్పారు. మళ్ళీ ఇటువంటి సమస్య తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకొంటామని మెట్రో అధికారులు చెప్పారు.