రూ.2,000 నోట్లు రద్దుపై కేంద్రం వివరణ

కేంద్రప్రభుత్వం రూ.2,000 నోట్లు రద్దు చేస్తుందంటూ ఈ మద్య ఊహాగానాలు మొదలయ్యాయి. నోట్ల రద్దు తరువాత వచ్చిన అనేక ఊహాగానాలు నిజం అవడంతో కొత్తగా మొదలైన ఈ ఊహాగానాలపై కూడా చర్చ మొదలైంది. దీనిపై కాంగ్రెస్ ఎంపి మధుసూదన్ మిస్త్రీ లోక్ సభలో అడిగిన ప్రశ్నకు కేంద్రహోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిట్జూ బదులిస్తూ “కేంద్రప్రభుత్వం అటువంటి ఆలోచన ఏదీ చేయడం లేదని స్పష్టం చేశారు. గుజరాత్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో రూ.2,000 నకిలీ నోట్లు బారీ స్థాయిలో పట్టుబడుతున్న మాట వాస్తవమని మంత్రి కిరణ్ రిట్జూ అంగీకరించారు. అయితే రూ.2,000 నోట్లలో చాలా భాద్రతాప్రమాణాలు ఉన్నందున వాటికి యదాతదంగా నైకిలీ నోట్లు ముద్రించడం అసాధ్యమని చెప్పారు. కనుక రూ.2,000 నోట్ల రద్దు గురించి వస్తున్న పుకార్లలో నిజం లేదని స్పష్టం చేశారు.