ఇండియన్ ఐడల్ మనోడికే

ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఐడల్ అవార్డు మన తెలుగువాడు రేవంత్ కు దక్కింది. విచిత్రమైన విషయం ఏమిటంటే విశాఖ నగరానికి చెందిన రేవంత్ కు హిందీ అసలు రాదు. కానీ పట్టుదలగా హిందీ పాటలను నేర్చుకొని ఈ పోటీలో పాడి అటు జడ్జిల ప్యానల్ ను, ఇటు ప్రేక్షకులను కూడా మెప్పించి ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డును సచిన్ టెండూల్కర్ చేతుల మీదుగా అందుకోవడం విశేషం. ఇండియన్ ఐడల్ 9వ సీజన్ పోటీలలో రేవంత్ ఈ అవార్డు అందుకొన్నారు. పంజాబ్ కు చెందిన ఖుదాబక్ష్ రన్నర్ అప్ గా నిలువగా మూడవ స్థానంలో మళ్ళీ మరో తెలుగువాడు రోహిత్ నిలవడం మరో విశేషం. ఇంతకు ముందు తెలుగువాడైన శ్రీరామచంద్ర ఈ ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డును అందుకొన్నాడు. అందరికీ సుపరిచితుడైన మరో తెలుగువాడు కారుణ్య రన్నర్ అప్ గా నిలచాడు. ఇన్నేళ్ళ తరువాత మళ్ళీ ఇద్దరు తెలుగువాళ్ళు రేవంత్, రోహిత్ మొదటి, మూడవ స్థానాలు దక్కించుకోగలిగారు. 

రేవంత్ పూర్తి పేరు లోలలా వెంకట రేవంత్ కుమార్ శర్మ. శ్రీకాకుళం జిల్లలో పుట్టి విశాఖపట్నంలో విద్యాభ్యాసం చేసి, హైదరాబాద్ లో స్థిరపడ్డాడు. ఇండియన్ ఐడల్-9 అవార్డు గెలుచుకొన్న రేవంత్ కు రూ.25లక్షలు నగదు బహుమతి, మహీంద్ర కేయూవీ 100 వాహనం అందుకొన్నారు. అంతకాదు..ప్రముఖ మ్యూజిక్ కంపెనీ “సోనీ మ్యూజిక్‌” కోసం పాటలు పాడేందుకు కూడా కాంట్రాక్టు బహుమతిగా దక్కింది.