ఏపి మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం పూర్తి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం కొద్దిసేపటి క్రితం పూర్తయింది. గవర్నర్ నరసింహన్ ఈరోజు 11 మంది చేత మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించారు. అమరావతిలో సచివాలయం సమీపంలో ఉన్న మైదానంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈరోజు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారి పేర్లు: 

కిమిడి కళా వెంకట్రావు (శ్రీకాకుళం), నారా లోకేశ్‌ (చిత్తూరు), అమర్‌నాథ రెడ్డి (చిత్తూరు), భూమా అఖిలప్రియ (కర్నూలు), కాల్వ శ్రీనివాస్‌ (అనంతపురం), సుజయకృష్ణ రంగారావు (విజయనగరం), సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి (నెల్లూరు) ఆదినారాయణ రెడ్డి (కడప), జవహర్‌ (పశ్చిమ గోదావరి) పితాని సత్యనారాయణ, (ప. గోదావరి) నక్కా ఆనందబాబు (గుంటూరు).

మంత్రిపదవులు కోల్పోయినవారు: బొజ్జల గోపాలకృష్ణారెడ్డి (చిత్తూరు), పల్లె రఘునాథరెడ్డి (అనంతపురం), రావెల కిషోర్‌బాబు (గుంటూరు), పీతల సుజాత (పశ్చిమ గోదావరి), కిమిడి మృణాళిని (విజయ నగరం).

వైకాపా నుంచి తెదేపాలో చేరి నేడు మంత్రులయినవారు: భూమా అఖిలప్రియ (కర్నూలు), సుజయకృష్ణ రంగారావు (విజయనగరం), ఆదినారాయణ రెడ్డి (కడప), అమర్‌నాథ రెడ్డి (చిత్తూరు) 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిపి మంత్రివర్గంలో మొత్తం 26మంది మంత్రులయ్యారు. వారి పేర్లు:  చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు (విశాఖపట్నం), కిమిడి కళా వెంకట్రావు, కింజరాపు అచ్చెన్నాయుడు (శ్రీకాకుళం), సుజయ కృష్ణ రంగారావు (విజయనగరం), నిమ్మకాయల చిన రాజప్ప, యనమల రామకృష్ణుడు (తూర్పు గోదావరి), పితాని సత్యనారాయణ, జవహర్‌, మాణిక్యాలరావు (పశ్చిమ గోదావరి), దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, కామినేని శ్రీనివాస్‌ (కృష్ణా), పత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు (గుంటూరు), శిద్ధా రాఘవరావు (ప్రకాశం), సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, పి. నారాయణ (నెల్లూరు), నారా లోకేశ్‌, అమర్‌నాథ రెడ్డి (చిత్తూరు), పరిటాల సునీత, కాల్వ శ్రీనివాస్‌ (అనంతపురం), ఆదినారాయణ రెడ్డి (కడప), కేఈ కృష్ణమూర్తి, భూమా అఖిలప్రియ (కర్నూలు).