ఇదేమి డిమాండ్ హన్మంతన్నా?

కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు శనివారం సాయంత్రం రాజ్ భవన్ ఎదుట హటాత్తుగా ధర్నా చేపట్టారు. రాజ్ భవన్ లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా పోలీసులు ఆయనను అడ్డుకొని అదుపులోకి తీసుకొన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు మంత్రి పదవులు చేపట్టనీయరాదని అయన డిమాండ్ చేసినట్లు సమాచారం.

ప్రస్తుతం తెలంగాణాలో మంత్రివర్గ విస్తరణ జరగడం లేదు కానీ రేపు ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గ విస్తరణ జరుగబోతోంది. దానిలో వైకాపా నుంచి తెదేపాలో చేరిన భూమా నాగిరెడ్డి కుమార్తె అఖిలప్రియ, మరొకరిద్దరు వైకాపా ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి పదవులు ఈయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన వ్యవహరం కనుక దాని కోసం హనుమంతరావు ధర్నా పేరిట హైదరాబాద్ లో హడావుడి చేయడం ఏమిటో అర్ధం కాదు. అయన తెలంగాణాకు సంబంధించిన కొన్ని సమస్యలపై నిన్న గవర్నర్ నరసింహన్ ను విమర్శించారు. వాటి కోసం ఆయన ధర్నా చేసినా ఏమైనా అర్ధం, ప్రయోజనం ఉండేవి కదా!