వీటికి నేడే ఆఖరి రోజు..

మార్చి 31వ తేదీ..అంటే ఆర్ధిక సంవత్సరం ముగింపు రోజని అందరికీ తెలుసు. కానీ ఈరోజు మరికొన్నిటికి కూడా ఆఖరి రోజు.

1. రిలయన్స్ జియో ప్రైమ్ మెంబర్ షిప్ కు నేడే ఆఖరి రోజు.

2.  రిలయన్స్ జియో ఉచిత, అపరిమిత సేవలకు నేడే ఆఖరి రోజు. 

3. పాత రూ.500,1000 నోట్లను రిజర్వ్ బ్యాంక్ శాఖలలో మార్పిడి చేసుకోవడానికి నేడే ఆఖరి రోజు.

4. దేశంలో నల్లధనం దాచుకొన్నవారు ఆ వివరాలను బయటపెట్టేందుకు కేంద్రప్రభుత్వం ప్రకటించిన ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ పధకానికి నేడే ఆఖరి రోజు.

5.స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ బికనీర్‌ అండ్‌ జైపూర్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ మైసూర్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ట్రావెన్ కూర్, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ పాటియాల బ్యాంకులకు ఈరోజే ఆఖరి రోజు. రేపటి నుంచి అవన్నీ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో విలీనం అయిపోతాయి.  

6. బి.ఎస్-3 ప్రమాణాలు కలిగిన అన్ని రకాల వాహనాలకు నేడే ఆఖరి రోజు. రేపటి నుంచి కేవలం బి ఎస్-4 ప్రమాణాలు కలిగిన వాహనాలను మాత్రమే అమ్మకాలు, రిజిస్ట్రేషన్లు చేయబడతాయి.

7. కేబుల్ టీవీ నుంచి సెట్ టాప్ బాక్సులకు మారేందేందుకు (డిజిటలైజేషన్) నేడే ఆఖరి రోజు.

8. ఆస్తిపన్ను చెల్లించడానికి నేడే ఆఖరి రోజు. 

9. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు నేటితో ముగుస్తాయి.