అగ్రిగోల్డ్ భాదితులకు పవన్ కళ్యాణ్ మద్దతు

అగ్రిగోల్డ్ సంస్థ చేతిలో సుమారు 20 లక్షల మంది మోసపోయారు. వారు గత రెండున్నర సం.లుగా తమకు న్యాయం చేయలని ప్రభుత్వాన్ని కోరుతూనే ఉన్నారు. ఏపి సర్కార్ తక్షణమే స్పందించి ఆ కేసుపై సి.ఐ.డి. విచారణకు ఆదేశించి, ఆ సంస్థ ఆస్తులను స్వాధీనం చేసుకొనప్పటికీ ఇంతవరకు కూడా భాదితులకు న్యాయం జరుగలేదు. ఎవరికీ ఒక్క పైసా కూడా తిరిగి చెల్లించలేదు. దానిపై ఇటీవల ప్రతిపక్ష పార్టీ వైకాపా శాసనసభలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసినపుడు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భాదితులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అయితే గత రెండున్నరేళ్ళుగా ఆయన ఇలాగే హామీలు ఇస్తున్నారు తప్ప తమకు న్యాయం చేయడం లేదని పిర్యాదు చేస్తున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారి సమస్యల గురించి తెలుసుకొనేందుకు ఈరోజు కొద్దిసేపటి క్రితం విజయవాడ చేరుకొన్నారు. నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అగ్రిగోల్డ్ బాదితులతో ఆయన సమావేశం అవుతున్నారు.