వరంగల్ లో పాస్ పోర్ట్ కార్యాలయం ఏర్పాటు చేయాలనే ఆ ప్రాంత ప్రజల చిరకాల కోరికను కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు నెరవేర్చాయి. నిన్న ఉగాది పండుగ సందర్భంగా హన్మకొండలోగల ప్రధాన తపాలాకార్యాలయంలో పాస్ పోర్ట్ కార్యాలయాన్ని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం, ఎంపిల కృషి కారణంగా ఈ పాస్ పోర్ట్ కార్యాలయం మంజూరు అయిందని తెలిపారు. వరంగల్, పరిసర జిల్లాల ప్రజలు హైదరాబాద్ వెళ్ళవలసిన అవసరం లేకుండా ఇక్కడే అన్ని రకాల పాస్ పోర్ట్ సేవలు పొందవచ్చని అన్నారు. ఈ కార్యాలయం నుంచి రోజుకు కనీసం 3,000 పాస్ పోర్ట్ లు జారీ అవుతున్నట్లయితే వరంగల్ లో శాశ్విత భవనం నిర్మిస్తామని మంత్రి చెప్పారు.