కేసీఆర్ కాదు గబ్బర్ సింగ్!

తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఎప్పుడూ ముఖ్యమంత్రి కేసీఆర్ నే లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తుంటారు. మళ్ళీ నిన్న అయన పై తీవ్ర విమర్శలు చేశారు. “ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వ పోకడలు చూస్తుంటే అలనాటి షోలే హిందీ సినిమాలో గబ్బర్ సింగ్ జ్ఞాపకం వస్తున్నాడు. ప్రజా సమస్యలపై మేము శాసనసభలో తెరాస సర్కార్ ను గట్టిగా నిలదీస్తామనే భయంతోనే మమ్మల్ని కుంటిసాకులతో సస్పెండ్ చేసి బయటకు పంపించేశారు. ప్రదానప్రతిపక్షమైన కాంగ్రెస్ శాసనసభలో తెరాస సర్కార్ ను గట్టిగా నిలదీయలేకపోయింది. పైగా అధికార, ప్రతిపక్షాలు ఒకరినొకరు పొగుడుకొంటూ కాలక్షేపం చేసారు. శాసనసభలో ప్రజా సమస్యలపై లోతుగా చర్చ జరుగకుండా తెరాస సభ్యులు అడ్డుకొన్నారు. కాంగ్రెస్, భాజపాలు తెరాసను ఎదుర్కోలేకపోతున్నాయనిపిస్తోంది. ఇకనైనా అవి ప్రజా సమస్యలపై ప్రభుత్వంతో క్షేత్రస్థాయిలో గట్టిగా పోరాడటం మొదలుపెట్టాలి,” అని రేవంత్ రెడ్డి అన్నారు.