నేటితో ముగియనున్న రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు

ఈనెల 10వ తేదీన గవర్నర్ నరసింహన్ ఉభయసభలను ఉద్దేశ్యించి చేసిన ప్రసంగంతో మొదలైన రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగియబోతున్నాయి. చివరి రోజైన ఈరోజు ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ ద్రవ్య వినిమయ బిల్లును సభలో ప్రవేశపెడతారు. 2015-16లో వివిధ ప్రభుత్వ శాఖల పనితీరుపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికను, అలాగే 2016-17 సం.లలో బీసి సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టి చర్యలు, వాటి ఫలితాలపై బిసి సంక్షేమ కమిటీ నివేదికను నేడు శాసనసభలో ప్రవేశపెడతారు. ఈసారి కూడా శాసనసభ, విధానసభలలో అధికార, ప్రతిపక్షాల మద్య విమర్శలు, వాదోపవాదాలు సాగినప్పటికీ ప్రజా సమస్యలపై చాలా అర్ధవంతమైన చర్చలు జరిగాయి. ప్రతిపక్ష సభ్యులు ఇచ్చిన పలు సూచనలు ప్రభుత్వం పరిగణనలోకి తీసుకొని తదనుగుణంగా చర్యలు చేపట్టడం చాల హర్షణీయం.