తెలంగాణా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు జానారెడ్డి, ఉత్తం కుమార్ రెడ్డి తదితరులు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ లెజిస్లేటివ్ విప్ సంపత్ కుమార్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు శనివారం ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అంశంపై శాసనసభలో చర్చ జరుగుతున్నప్పుడు, సభలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడాన్ని సంపత్ తప్పుపట్టారు. తెరాస సర్కార్ అందరికీ మాట్లాడే అవకాశం ఇస్తున్నప్పటికీ తమ స్వంత పార్టీలో సీనియర్ నేతలే తన వంటివారికి సభలో మాట్లాడేఅవకాశం ఇవ్వడం లేదని అందుకు నిరసనగా తన పదవికి రాజినామా చేస్తున్నానని ప్రకటించారు. దీనిపై టిపిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి ఇంకా స్పందించవలసి ఉంది.