రైల్వేఖామంత్రి సురేష్ ప్రభు ఈరోజు హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ నుంచి రిమోట్ పద్దతిలో పెద్దపల్లి-నిజామాబాద్ రైల్వే లైనును ప్రారంభించారు. అదే సమయంలో నిజామాబాద్ రైల్వేస్టేషన్లో మంత్రి పోచారం శ్రీనివాస్ పచ్చ జెండా ఊపి రైలును ప్రారంభించారు. దీని కోసం కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూపులు చూస్తున్నారు. తెరాస సర్కార్, ఎంపిలు చొరవతో ఇన్నాళ్ళకు వారి కల నెరవేరింది. రైల్వే మంత్రి సురేష్ ప్రభు హైటెక్ సిటీ నుంచే హైదరాబాద్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లలోని ‘డిజి-పే’ (డిజిటల్ పేమెంట్) విధానాన్ని కూడా రిమోట్ పద్దతిలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, ఎంపిలు కవిత, జితేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.