వాళ్ళిదరికీ షాక్ ఇచ్చిన ఈసి

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రాతినిధ్యం వహించిన చెన్నైలోని ఆర్ కె నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఏప్రిల్ 12న ఉపఎన్నికలు జరుగబోతున్నాయి. సరిగ్గా ఈ సమయంలోనే ఆ పార్టీని, దాని ఎన్నికల చిహ్నమైన ‘రెండు ఆకులు’ దక్కించుకోవడం కోసం ముఖ్యమంత్రి పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాల మద్య  పోరాటం మొదలైంది. వారి పంచాయితీ కేంద్ర ఎన్నికల కమీషన్ కు చేరింది. కానీ అది ఇరువర్గాలకు పెద్ద షాక్ ఇచ్చింది. ఉపఎన్నికలకు ఇంకా ఎక్కువ సమయం లేదు. వారిరువురిలో అన్నాడిఎంకె పార్టీ ఎవరికి చెందుతుందనే విషయంపై నిర్ణయం తీసుకోవడానికి లోతుగా పరిశీలించడానికి చాలా సమయం పడుతుంది కనుక ‘రెండు ఆకులు’ చిహ్నాన్ని తాత్కాలికంగా ఎవరికీ చెందకుండా పక్కన పెడుతున్నట్లు ఎన్నికల కమీషన్ ప్రకటించింది. కనుక ఈ ఉపఎన్నికల కోసం తాత్కాలికంగా వేరే ఎన్నికల చిహ్నాలను ఎంచుకొని తెలియజేయవలసిందిగా ఎన్నికల కమీషన్ ఇరు వర్గాలను కోరింది. ఈరోజు వారు తమ తమ ఎన్నికల చిహ్నాలను ఎన్నికల కమీషన్ కు సమర్పించబోతున్నారు.