త్వరలో తెరాస బహిరంగసభ

తెరాస ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వచ్చే నెల 27న వరంగల్ లో ఆ పార్టీ 'ప్రగతి గర్జన' పేరిట బారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది. అంతకంటే ముందుగా హైదరాబాద్ లో పార్టీ ప్లీనరీ సమావేశం నిర్వహించబడుతుంది. దానిలో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుంది. ప్రగతి గర్జన సభలో చర్చించాల్సిన వివిధ అంశాలపై ఈ ప్లీనరీలో చర్చిస్తారు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల నుంచి దీనికి తెరాస నేతలు కార్యకర్తలు హాజరవుతారు. ఈ ప్లీనరీ ఏర్పాటు చేసేలోగా పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులకు సూచించారు.

వరంగల్ లో జరుగబోయే ప్రగతి గర్జన సభకు లక్షల సంఖ్యలో ప్రజలు, పార్టీ కార్యకర్తలు హాజరయ్యే అవకాశం ఉంది కనుక ఇప్పటి నుంచే దానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని కేసీఆర్ మంత్రులకు సూచించారు. ఈ సభలో గత రెండున్నరేళ్ళ తెరాస పాలనలో చేసిన, చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరిస్తారు. అలాగే 2019 ఎన్నికలను ఎదుర్కోవడానికి పార్టీ నేతలు, కార్యకర్తలకు కేసీఆర్ మార్గనిర్దేశనం చేసే అవకాశం ఉంది.