ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి బాధ్యతలు చేపట్టినప్పుడే ఆ రాష్ట్రంలో ఊహించని పరిణామాలు చాలా జరిగే అవకాశం ఉందని స్పష్టం అయ్యింది. ఊహించినట్లుగానే ఆయన రాష్ట్రంలో రెండు కబేళాలను మూయించివేశారు. రాష్ట్రంలోని అన్ని గోవధశాలలను మూసివేయడానికి రాష్ట్ర పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఆవుల అక్రమ రవాణాపై నిషేధం విదించారు. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో ఖైనీ, తంబాకు, గుట్కా తినడానికి నిషేధించారు. రోడ్లు, ఇతర బహిరంగ ప్రదేశాలలో ఆడపిల్లలను వేధించే ఆకతాయిల పని పట్టడానికి యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్స్ ను రంగంలోకి దించారు. రానున్న రోజులలో మరిన్ని కటినమైన చర్యలు తీసుకోబోతున్నట్లు ఆయన అనుచరులు చెపుతున్నారు.
యోగికి హిందు అతివాదిగా ముద్ర ఉండటమే కాకుండా ఇప్పుడు గోవధ నిషధం వంటి కటినమైన నిర్ణయాలు తీసుకొంటున్నందున అప్పుడే ఉగ్రవాదుల నుంచి మొదటి హెచ్చరికలు అందాయి. ఈనెల 24న యూపిలోని పూర్వాంచల్ ప్రాంతంలో జరుగబోయే హింసను దమ్ముంటే అడ్డుకోవాలని ఐసిస్ ఉగ్రవాద సంస్థ పేరిట ఒక పోస్టర్ వారణాసిలో వెలిసింది. దానిని పోలీసులు స్వాధీనం చేసుకొని దర్యాప్తు మొదలుపెట్టారు.