ఏపిలో స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎన్నికలలో కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాలలో తెదేపా గెలిచింది. కడపలో బీటెక్ రవి, కర్నూలులో శిల్పా చక్రపాణిరెడ్డి, నెల్లూరులో తెదేపా అభ్యర్ధి వాకాటి నారాయణ రెడ్డి గెలిచారు.
జగన్మోహన్ రెడ్డి స్వంత నియోజకవర్గమైన కడపలో వైకాపా అభ్యర్ధిగా పోటీ చేసిన ఎస్.వివేకానంద రెడ్డి తెదేపా అభ్యర్ధి బీటెక్ రవి చేతిలో 33 ఓట్లు తేడాతో ఓడిపోవడం వైకాపాకు పెద్ద షాక్ అనే చెప్పవచ్చు.
కర్నూలులో వైకాపా అభ్యర్ధి గౌరు వెంకట రెడ్డిపై తెదేపా అభ్యర్ధి శిల్పా చక్రపాణిరెడ్డి 56 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. నెల్లూరులో వైకాపా అభ్యర్ధి ఆనం విజయ్ కుమార్ రెడ్డిపై తెదేపా అభ్యర్ధి వాకాటి నారాయణ రెడ్డి 87 ఓట్లు మెజార్టీతో విజయం సాధించారు.