ఇక తెరాసతో జబర్దస్త్ ఫైట్స్

టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అధ్యక్షతన ఆదివారం హైదరాబాద్ లో టిజెఎసి విస్త్రుతస్థాయి సమావేశం జరిగింది. దానిలో తమ తదుపరి కార్యాచరణను ఖరారు చేసి ప్రకటించారు. కేజీ టు పీజి ఉచితవిద్య హామీని తక్షణం నెరవేర్చాలని కోరుతూ వచ్చే నెలలో జిల్లాస్థాయి సదస్సులు నిర్వహిస్తారు. తెరాస సర్కార్ పై పోరాటాలు మరింత ఉదృతం చేయాలని నిర్ణయించారు. ఆ ప్రయత్నంలో భాగంగా మే నెలాఖరులోగా గ్రామస్థాయినుంచి టిజెఎసి కమిటీలు ఏర్పాటుచేసుకోవాలని నిర్ణయించారు. ఉద్యోగాల భర్తీ కోసం పోరాటాలు ఉదృతం చేయాలని నిర్ణయించారు. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోసం కలలుగన్న స్వర్గీయ జయశంకర్ స్పూర్తితో ‘బతుకు తెలంగాణా సాధన’ పేరిట జూన్ 21 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా యాత్రలు చేయాలని నిర్ణయించారు.