గోవా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మనోహర్ పార్రికర్ ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈరోజు శాసనసభలో బలనిరూపణ చేసుకొని విజయం సాధించింది. మొత్తం 40 మంది సభ్యులున్న గోవా అసెంబ్లీలో 22 మంది ఆయనకు మద్దతు పలుకడం విశ్వాస పరీక్షలో నెగ్గారు. విశ్వజీత్ రాణే అనే ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఓటింగ్ జరుగుతున్న సమయంలో సభ నుంచి బయటకు వెళ్ళిపోయారు. తద్వారా ఆయన పరోక్షంగా పార్రికర్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినట్లే భావించవచ్చు. కాంగ్రెస్ పార్టీ 17 సీట్లు గెలుచుకొన్నప్పటికీ, దిగ్విజయ్ సింగ్ చేతకానితనం వలననే త్రుటిలో అధికారం చేజారిపోయిందని విశ్వజీత్ రాణే చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనుక మున్ముందు కాంగ్రెస్ గోడ దూకేసి పారిక్కర్ పక్కన జేరిపోయినా ఆశ్చర్యం లేదు. మరో ఐదేళ్ళవరకు ఎన్నికలు రావు కనుక కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో మరికొంత మంది భాజపా కండువాలు కప్పుకొన్నా ఆశ్చర్యం లేదు.
తాజా సమాచారం: కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వైఫల్యాన్ని నిరసిస్తూ విశ్వజీత్ రాణే పార్టీకి రాజీనామా చేశారు.