సిద్ధూ కల నెరవేరింది

మాజీ క్రికెటర్, మాజీ భాజపా ఎంపి నవజ్యోత్ సింగ్ సిద్ధూ కల నెరవేరింది. పంజాబ్ మంత్రి అయిపోయాడురు. ఈరోజు కెప్టెన్ అమరీందర్ సింగ్ పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయన మంత్రివర్గంలో నవజ్యోత్ సింగ్ సిద్ధూ కూడా మంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు. అతనికి ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వవచ్చని వార్తలు వినిపించాయి. కానీ మంత్రులకు ఇంకా శాఖలు కేటాయించకపోవడంతో ఊహాగానాలు కొనసాగుతున్నాయి. 

మొదట భాజపా ఎంపిగా ఉన్న నవజ్యోత్ సింగ్ సిద్ధూ తన స్వంత రాష్ట్రమైన పంజాబ్ కు ముఖ్యమంత్రి లేదా ఉప ముఖ్యమంత్రి కావాలని కలలు కన్నాడు. ఆమాద్మీ పార్టీ నుంచి ఆహ్వానం రావడంతో భాజపాకు రాజీనామా చేశాడు. కానీ తన షరతులకు కేజ్రివాల్ అంగీకరించకపోవడంతో  సిద్ధూ స్వంత కుంపటి పెట్టుకొన్నాడు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీతో బేరం ఆడుకొని దానిలో చేరిపోయి ఇప్పుడు మంత్రి అయిపోయాడు. 

ఈ ఎన్నికలలో భాజపా-అకాలీదళ్ సంకీర్ణ ప్రభుత్వం ఓడిపోతుందని బహుశః నవజ్యోత్ సింగ్ సిద్ధూ అందరికంటే ముందుగా పసిగట్టినట్లున్నారు. అందుకే దానిని వదిలించుకొని విజయావకాశాలు ఉన్నాయనుకొన్న కాంగ్రెస్ పార్టీలో చేరిపోయి మంత్రి అయిపోయాడు. ఈ రాజకీయ గేమ్ లో సిద్దూ మొదట కొంచెం తడబడినా చివరకు తను అనుకొన్న లక్ష్యాన్ని సాధించగలిగాడు. ఉప ముఖ్యమంత్రి పదవి కూడా దక్కితే సెంచరీ కొట్టినంత సంతోషిస్తాడు.