ఆ ఆలోచన కేసీఆరే కలిగించారు కదా..

రాష్ట్ర శాసనమండలిలో గవర్నర్ నరసింహన్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సభ్యులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ “మాకు మధ్యంతర ఎన్నికలకు వెళ్ళే ఉద్దేశ్యం లేదు. మనం చేయవలసిన పనులను మనం నిజాయితీగా చేసుకుపోతే ప్రజలే మనల్ని ఆశీర్వదిస్తారు,” అని అన్నారు. 

కాంగ్రెస్ పార్టీలో దిగ్విజయ్ సింగ్, జైపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వంటి కొందరు సీనియర్ నేతలు “ఎప్పుడైనా మధ్యంతర ఎన్నికలు రావచ్చు కనుక అందరూ సిద్దంగా ఉండాలని” చెపుతుంటారు. ఇటీవల బడ్జెట్ సమావేశాలకు ముందురోజు తెరాస శాసనసభా పక్ష సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలను ఉద్దేశ్యించి కేసీఆర్ మాట్లాడుతూ “ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించినట్లయితే మనకు 101-106 సీట్లు తప్పకుండా వస్తాయి,” అని అన్నారు. అప్పటి నుంచి ఈ మధ్యంతర ఎన్నికల ఊహాగానాలు ఇంకా జోరందుకొన్నాయి. మళ్ళీ వాటికి కేసీఆర్ స్వయంగా బ్రేకులు వేయడం విశేషం.