ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు కొద్ది సేపటి క్రితమే 2017-18 సం.ల రాష్ట్ర బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశ పెట్టారు. ఆ వివరాలు:
బడ్జెట్ మొత్తం విలువ : రూ.1, 56,999 కోట్లు, ఆర్థికలోటు: రూ. 23,054 కోట్లు, రెవెన్యూ లోటు: రూ. 416 కోట్లు
శాఖల వారిగా కేటాయింపులు: గ్రామీణాభివృద్ధి శాఖ: రూ. 19,567 కోట్లు, జలవనరులశాఖ: రూ. 12,770 కోట్లు, ప్రాధమిక విద్య: రూ. 17,197 కోట్లు, ఉన్నత విద్య: రూ. 3,513 కోట్లు, పంచాయతీ రాజ్ శాఖ రూ. 6,562 కోట్లు, రోడ్లు, భవనాలశాఖ: రూ. 4,041 కోట్లు, విద్యుత్ శాఖ: రూ.4,311 కోట్లు, హోం శాఖ: రూ.5,221 కోట్లు, మున్సిపల్ శాఖ: రూ.5,207 కోట్లు, ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ శాఖ: రూ. 7,021 కోట్లు, గృహ నిర్మాణ శాఖ: రూ.1,457 కోట్లు, పౌరసరఫరాల శాఖ రూ.2,800 కోట్లు, పరిశ్రమల శాఖ: రూ.2,086 కోట్లు, పశుసంవర్ధక శాఖ: రూ.1,112 కోట్లు, అటవీశాఖ: రూ.383 కోట్లు, ఐటీ శాఖ: రూ.364 కోట్లు చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ: రూ.125 కోట్లు, మత్స్యశాఖ: రూ.282 కోట్లు, సాంస్కృతిక వ్యవహారాల శాఖ: రూ. 72 కోట్లు.
సంక్షేమం: నిరుద్యోగ భృతి: రూ. 500 కోట్లు, బీసీ సంక్షేమం: రూ. 10,000 కోట్లు, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కోసం: రూ. 9,747 కోట్లు, స్త్రీ, శిశువు, వికలాంగులు మరియు వృద్ధుల సంక్షేమం: రూ.1,773 కోట్లు, డ్వాక్రా సంఘాలకు రుణాలు: రూ.1,600 కోట్లు, పెన్షన్లు: రూ.4,376 కోట్లు, రైతుల రుణమాఫీ: రూ.3,600 కోట్లు, మహిళా సాధికార సంస్థ: రూ.400 కోట్లు వికలాంగుల సంక్షేమం: రూ.89 కోట్లు, బ్రాహ్మణ కార్పొరేషన్: రూ.75 కోట్లు, కాపు కార్పొరేషన్: రూ.1,000 కోట్లు, రాష్ట్ర క్రైస్థవ కార్పొరేషన్: రూ.35 కోట్లు.
అభివృద్ధి పనులు: రాజధాని ప్రాంతం అభివృద్ధి: రూ. 1,061 కోట్లు, అమరావతిలో అంబేద్కర్ స్మృతి వనం నిర్మాణం కోసం: రూ.97 కోట్లు, రహదారుల నిర్వహణకు రూ. 1102 కోట్లు, గ్రామీణ రహదారులు: రూ. 262 కోట్లు, శాప్: రూ. 195 కోట్లు, ఎన్టీఆర్ సుజల స్రవంతి: రూ.100 కోట్లు.
ఇతర కార్యక్రమాలకు: స్కిల్ డెవలప్‌మెంట్: రూ.398 కోట్లు, ఎన్టీఆర్ క్యాంటీన్లు: రూ.200 కోట్లు, ఎల్.పి.జి.కనెక్షన్ల కోసం: రూ.350 కోట్లు ఎన్టీఆర్ వైద్య సేవ: రూ. 1,000 కోట్లు, మసీదుల్లో పనిచేసే ఇమామ్‌లు, మౌసమ్‌లకు గౌరవ వేతనాలు: రూ.24 కోట్లు, వక్ఫ్ సర్వే కమిషన్: రూ.50 కోట్లు, జెరూసెలెం యాత్రికులకు ప్రభుత్వ సహాయం: రూ. 20,000 నుంచి 40,000 కు పెంపు, కొత్త చర్చిల నిర్మాణానికి ప్రభుత్వ సహాయం లక్ష నుంచి 3 లక్షల రూపాయలకు పెంపు.