మణిపూర్ గవర్నర్ నజ్మా హెఫ్తుల్లా భాజపాను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. భాజపా శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన బీరేన్ సింగ్ రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు మణిపూర్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
మణిపూర్ శాసనసభలో మొత్తం 60 స్థానాలుండగా వాటిలో కాంగ్రెస్ పార్టీకి 28, భాజపాకు 21, ఇతరులకు 11 సీట్లు వచ్చాయి. కనుక రాజ్యాంగం ప్రకారం అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్ పార్టీనే గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటు చేయమని ఆహ్వానించాలి. కానీ (ఇతర పార్టీ ఎమ్మెల్యేల మద్దతుతో కలిపి) భాజపాకు మొత్తం 32 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఉన్నందున దానినే ఆహ్వానిస్తున్నట్లు గవర్నర్ చెప్పారు. తను గత 37 ఏళ్ళుగా కాంగ్రెస్, కాంగ్రెసేతర ప్రభుత్వాలతో కలిసి పనిచేశానని, కానీ ఏనాడూ రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరించలేదని, ఇప్పుడు కూడా రాజ్యాంగబద్దంగానే వ్యవహరిస్తున్నప్పటికీ తనపై కొంతమంది ఆరోపణలు చేయడం చాలా దురదృష్టకరమని అన్నారు.