ప్రముఖ నటి జయసుధ భర్త నితిన్ కపూర్ (58) మృతి చెందారు. ఆయన ముంబైలోని తన సినీ కార్యాలయంలో అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు గుర్తించారు. ఆయన ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంగతి తెలియగానే జయసుధ హుటాహుటిన హైదరాబాద్ నుంచి ముంబై బయలుదేరి వెళ్ళారు. జయసుధ, నితిన్ కపూర్ మద్య ఎటువంటి మనస్పర్ధలు లేవు. కనుక ఆయన ఆత్మహత్యకు కారణాలు తెలియవలసి ఉంది.
జయసుధ, నితిన్ కపూర్ దంపతులకు నిహార్, శ్రేయాన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో శ్రేయాన్ కొద్ది రోజుల క్రితమే బస్తీ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో ప్రవేశించాడు. అలనాటి ప్రముఖ బాలివుడ్ నటుడు జితెన్ద్రకు నితిన్ కపూర్ స్వయాన్న సోదరుడు. నితిన్ కపూర్ హిందీలో మేరా పతి సిర్ఫ్ మేరా హై, తెలుగులో కలికాలం, హ్యాండ్సాఫ్ సినిమాలను నిర్మించారు.