జనసేన భవిష్య కార్యాచరణ ఏమిటంటే

జనసేన పార్టీ స్థాపించి నేటితో 3 సం.లు పూర్తయిన సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టి తన పార్టీ భవిష్య కార్యాచరణను ప్రకటించారు. ముఖ్యాంశాలు:

1. జనసేన పార్టీ వచ్చే ఎన్నికలలో రెండు తెలుగు రాష్ట్రాలలో పోటీ చేస్తుంది.

2. చిరంజీవి జనసేనలో చేరరు. ఎందుకంటే ఇద్దరి ఆలోచనలు, అభిప్రాయలు కలవవు గనుక. 

3. జూన్ నెల నుంచి జనసేన పార్టీ నిర్మాణం. అది పూర్తయిన తరువాత పొత్తుల గురించి ఆలోచన. 

4. మొత్తం 32 అంశాలను పార్టీ గుర్తించింది. వాటి ఆధారంగా పార్టీ రాజ్యాంగం రూపొందించబడుతుంది. 

5. యువతకు, మెగాభిమానులకే పార్టీలో పెద్ద పీట.

6. తెదేపాతో శత్రుత్వం లేదు. నేటికీ ఆ పార్టీ జనసేనకు మిత్రపక్షమే.

7. పార్టీ అంతిమ లక్ష్యం అధికారం కాదు. ప్రజా సమస్యల పరిష్కారమే.