తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్కుల చెల్లింపుల కధ హైకోర్టుకు చేరిన సంగతి తెలిసిందే. భక్తులు ఇచ్చే కామన్ గుడ్ ఫండ్ నిధులను శిధిల దేవాలయల పునరుద్దరణకు, దేవాలయాలలో ధూపదీపవైవేద్యాల కోసం మాత్రమే వినియోగించవలసి ఉండగా, ఆ నిధులతో కేసీఆర్ తన మొక్కులు చెల్లించుకొంటున్నారని, అది నిబందనలకు వ్యతిరేకమని ఆరోపిస్తూ ప్రొఫెసర్ కంచే ఐలయ్య హైకోర్టులో పిటిషన్ వేశారు. దానిపై స్పందించిన హైకోర్టు ఈరోజు తెలంగాణా ప్రభుత్వానికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, దేవాదాయ శాఖ కమీషనర్ కు నోటీసులు పంపించింది. వాటికి నాలుగు వారాలలోగా జవాబు ఇవ్వాలని ఆదేశించింది. ఒకవేళ పిటిషనర్ అభిప్రాయంతో హైకోర్టు ఏకీభవించినట్లయితే, అప్పుడు తెలంగాణా సర్కార్ ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కోవలసి ఉంటుంది.