నేటి నుంచి ఏపి బడ్జెట్ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి మొదలవబోతున్నాయి. నిన్నటి నుంచే సమావేశాలు మొదలవ వలసి ఉన్నప్పటికీ, ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతికి సంతాపంగా నిన్న శాసనసభ, మండలికి శలవు ప్రకటించారు. ఈరోజు ఉదయం 9గంటలకు శాసనసభ, మండలి సమావేశాలు మొదలవుతాయి. రేపు ఏపి ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్ ప్రవేశపెడతారు. బడ్జెట్ వివరాలు ఇంకా తెలియవలసి ఉంది. ఏపి బడ్జెట్ లో కూడా తెలంగాణా బడ్జెట్ లాగే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకే ఎక్కువ ప్రాధాన్యతనీయవచ్చు.