నేడు భూమా అంత్యక్రియలు

కర్నూలు జిల్లా, నంద్యాల వైకాపా ఎమ్మెల్యే ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి (53) నిన్న గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. జిల్లాలోని ఆళ్లగడ్డలో నేడు ఆయన అంత్యక్రియలు జరుగబోతున్నాయి. ఆయన వైకాపా నుంచి తెదేపాలోకి మారినప్పటికీ రెండు పార్టీలలో ఆయనకు మంచి గౌరవం, అందరితో సత్సంబంధాలు ఉన్నందున రెండు పార్టీల నేతలు అయన అంత్యక్రియలకు హాజరుకాబోతున్నారు. 

భూమా అంత్యక్రియలకు ఏపి సిఎం చంద్రబాబు నాయుడు, తెదేపా మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు హాజరుకాబోతున్నారు. అలాగే వైకాపా నేతలు కూడా హాజరుకాబోతున్నారు. 

ఆయన మృతికి సంతాపంగా ఏపి సర్కార్ నేడు ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలికి శలవు ప్రకటించింది. నేడు ఏపి రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టవలసి ఉంది. ఆ కార్యక్రమాన్ని రేపటికి వాయిదా వేశారు. 

భూమా మరణించిన తరువాత ఆయన నేత్రాలను ఆయన కుటుంబ సభ్యులు దానం చేశారు. ఆయన భార్య శోభా నాగిరెడ్డి సుమారు మూడేళ్ళ క్రితం కారు ప్రమాదంలో మరణించారు. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వారిలో కుమార్తె అఖిలప్రియ తన తల్లి ప్రాతినిద్యం వహించిన ఆళ్లగడ్డకు ఎమ్మెల్యేగా ప్రాతినిద్యం వహిస్తున్నారు.