నిర్మాత దిల్ రాజు భార్య మృతి

ప్రముఖ తెలుగు సినీ నిర్మాత దిల్ రాజు భార్య అనిత (46) శనివారం సాయంత్రం గుండెపోటుతో మరణించారు. ఆమె అస్వస్థతగా ఉన్నట్లు చెప్పగానే కుటుంబ సభ్యులు ఆమెను హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి తరలించారు. కానీ చికిత్స అందిస్తుండగానే ఆమె తుది శ్వాశ విడిచారు. 

దిల్ రాజు ఫిదా సినిమా షూటింగ్ కోసం అమెరికాలో ఉన్నారిప్పుడు. భార్య మరణ వార్త తెలియగానే అయన వెంటనే హైదరాబాద్ బయలుదేరారు. దిల్ రాజు దంపతులు కొన్ని రోజుల క్రితమే తమ కుమార్తె హన్హిత వివాహం జరిపించారు. సినీ పరిశ్రమలో పెద్ద చిన్న నిర్మాతలు, దర్శకులు, నటీనటులు అందరితో చాలా స్నేహంగా మెలిగే దిల్ రాజుకు ఇంత కష్టం వచ్చినందుకు సినీ పరిశ్రమలో అందరూ చాలా బాధపడుతున్నారు. ఆయన హైదరాబాద్ చేరుకొన్న తరువాత శ్రీమతి అనిత అంత్యక్రియలు జరుగుతాయి.