మణిపూర్ లో సాయుధ దళాలకు ఇవ్వబడిన ప్రత్యేకాధికారాలను రద్దు చేయాలని కోరుతూ ఏకంగా 16 ఏళ్ళపాటు నిరవధిక నిరాహార దీక్ష చేసిన ఇరోమ్ షర్మిల, (ముక్కుకు అమర్చిన గొట్టాల ద్వారా ద్రవాహారం తీసుకొనేవారు) ఇంకా ఎన్నేళ్ళు దీక్షను కొనసాగించినా ఫలితం ఉండదని గ్రహించి, కొన్ని నెలల క్రితమే తన దీక్షను విరమించి పీపుల్స్ రిసర్జెన్స్ అండ్ జస్టిస్ అలయెన్స్ పార్టీని స్థాపించి మణిపూర్ శాసనసభ ఎన్నికలలో పోటీ చేశారు. ఆమె మణిపూర్ ముఖ్యమంత్రి ఒక్రాం ఇబోబి సింగ్ పై తౌబాల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసారు. కానీ ఆయన చేతిలో ఘోరపరాజయం పాలయ్యారు. ఆమె పార్టీ అభ్యర్ధులు కూడా అన్ని చోట్లా చాలా వెనుకబడిపోయారు. మణిపూర్ లో కాంగ్రెస్, భాజపాల మద్యనే పోటీ నెలకొంది.
సుమారు 16 ఏళ్లుగా నిరాహార దీక్షలో ఉన్న కారణంగా ఇరోమ్ షర్మిలకు రాజకీయ అవగాహనా లేకపోవడం, మణిపూర్ ప్రజల కోసం తను చేస్తున్న పోరాటం కారణంగా వారు తన వెంటే ఉన్నారని భ్రమ పడటం, దేశముదురు కాంగ్రెస్, భాజపాల శక్తి యుక్తులను చాలా తక్కువగా అంచనా వేయడం వంటి అనేక కారణాలు ఆమె ఓటమికి కారణాలుగా చెప్పవచ్చు.
తాజా సమాచారం: భాజపా: 11, కాంగ్రెస్:13, ఎన్.పి.ఎఫ్:3, ఇతరులు: 9 స్థానాల ఆధిక్యతలో ఉన్నాయి.
భాజపా:2, కాంగ్రెస్:4, ఎన్.పి.ఎఫ్:1, ఇతరులు:1 స్థానంలో విజయం సాధించాయి.