ఆ ఇద్దరిపై సస్పెన్షన్ వేటు

తెదేపా ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్యలపై సస్పెన్షన్ వేటు పడింది. వారిరువురూ నిన్న గవర్నర్ నరసింహన్ ఉభయసభలను ఉద్దేశ్యించి ప్రసంగిస్తున్న సమయంలో దానిని వ్యతిరేకిస్తూ సభలో నినాదాలు చేసారు. సభా సాంప్రదాయాలు మరిచి గవర్నర్ ప్రసంగానికి అడ్డు పడినందుకు వారిరువురినీ ఈ బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకు సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ మధుసూదనాచారి ప్రకటించారు. కాంగ్రెస్ నేతలు కూడా గవర్నర్ నరసింహన్  ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ ఆయన ప్రసంగిస్తున్న సమయంలోనే సభ నుంచి వాక్ అవుట్ చేసి నిరసన తెలిపారు. కానీ తెరాస సర్కార్ వారిపై ఎటువంటి చర్య తీసుకోకపోవడం విశేషం. వివిధ అంశాలపై శాసనసభలో జరిగే చర్చలలో కాంగ్రెస్ సభ్యులు సభా మర్యాదలకు లోబడే విమర్శలు చేస్తుంటారు కనుక తెరాస సర్కార్ వారిని ఉపేక్షించినట్లుంది.