నేటి నుంచి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు

నేటి నుంచి తెలంగాణా రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు మొదలవుతాయి. ఉదయం 10గంటలకు గవర్నర్ నరసింహన్ ఉభయసభలను ఉద్దేశ్యించి ప్రసంగిస్తారు. అనంతరం బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ మరియు సమావేశాలలో చర్చించాల్సిన ముఖ్య అంశాల జాబితాను ఖరారు చేసేందుకు శాసనసభ వ్యవహారాల కమిటీ సమావేశం అవుతుంది. రాష్ట్ర ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ మార్చి 13న 2017-18 సం.ల రాష్ట్ర ఆర్ధిక బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెడతారు. ఈ నెల 28వరకు బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశం ఉంది.