తెలంగాణా ప్రభుత్వం,
గూగుల్ ఇండియా ఇటీవల ఒక ఒప్పందం కుదుర్చుకొన్నాయి. ‘డిజిటల్ అన్ లాక్డ్’ అనే
పేరుతో తెలంగాణాలో యువతకు, చిన్న మరియు మద్య తరహా సంస్థలు స్థాపించడానికి ఆసక్తి
కలిగినవారికి ఆన్ లైన్ మరియు ఆఫ్ లైన్ విధానాల ద్వారా ఐటి, మొబైల్, క్లౌడ్ కంప్యూటింగ్,
సాఫ్ట్ వేర్ రంగాలలో అవసరమైన శిక్షణ, తోడ్పాటు అందించడానికి గూగుల్ సిద్దంగా ఉంది.
ఆ దిశలో గూగుల్ సంస్థ గురువారం హైదరాబాద్ లో 40 చిన్న, మధ్యతరగతి సంస్థలకు ఒక
శిక్షణా శిభిరం నిర్వహిస్తోంది. భారతీయ అవసరాలకు, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా
రూపొందించబడిన ఆన్-లైన్ శిక్షణా కార్యక్రమంలో 90 వీడియోలు ఉంటాయి. వాటిలో యువత తమకు
నచ్చినవాటిని ఎంచుకోవచ్చు. ఈ ఆన్-లైన్, ఆఫ్ లైన్ శిక్షణపొందిన వారికి గూగుల్ ఇండియా
సర్టిఫికెట్లు కూడా ఇస్తుంది కనుక అవి ఉద్యోగాలకు కూడా చాలా ఉపయోగపడవచ్చు.
రాబోయే మూడేళ్ళలో
గూగుల్ ఇండియా సంస్థ దేశ వ్యాప్తంగా ఇటువంటివి 5000 శిక్షణా తరగతులు నిర్వహించబోతోంది.
తెలంగాణా ప్రభుత్వం ఈ శిక్షణా కార్యక్రమం కోసం గూగుల్ ఇండియాతో ఒప్పందం చేసుకొంది
కనుక దీనిలో శిక్షణ పొందిన యువతకు చిన్న లేదా మద్య తరహా సంస్థలు ఏర్పాటు చేసుకోవడానికి
అన్ని విధాల సహాయం పడటానికి సిద్ధంగా ఉంది. కనుక తెలంగాణా యువత ఈ అవకాశాన్ని
సద్వినియోగపరుచుకోవడం చాలా మంచిది. డిజిటల్ అన్ లాక్డ్ కార్యక్రమంలో తమ పేర్లను
నమోదుకు, అది అందిస్తున్న శిక్షణ వివరాలను తెలుసుకొనేందుకు https://digitalunlocked.withgoogle.com/ సందర్శించండి.