మంగళవారం ఉదయం 8.30 గంటలకు భోపాల్-ఉజ్జయినీ ప్యాసింజర్ రైలులో ప్రేలుళ్ళు సంభవించాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు గాయపడినట్లు తెలుస్తోంది. మద్యప్రదేశ్ లోషాజాపూర్ జిల్లాలోని కాలా పీపల్ అనే ప్రాంతం సమీపంలో ఈ ప్రేలుడు జరిగింది. బోగీలో ఉన్న ప్రయాణికులు వెంటనే చైన్ లాగి రైలుని నిలిపివేసి కిందకు దిగిపోయారు. ఆ ప్రేలుళ్ళకు కారణం విద్రోహచర్యా లేక వేరే ఏదైనా కారణమా? అనేది తెలియవలసి ఉంది. ఈ సంగతి తెలియగానీ జిల్లా అధికారులు అక్కడికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలుపెట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు. ఈ ప్రేలుళ్ళలో ప్రాణనష్టం జరుగలేదని సమాచారం.