నేడు కేసీఆర్ గజ్వేల్ పర్యటన

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తను ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో నేడు పర్యటించబోతున్నారు. గజ్వేల్ లో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యాక్రమాలను స్వయంగా పరిశీలించి వాటిపై అధికారులకు అవసరమైన సలహాలు సూచనలు ఇస్తారు. వచ్చే సోమవారం గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన ప్రజా ప్రతినిధులు, అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లోని ‘జనహిత’ కార్యాలయంలో సమావేశమయ్యి ఆ నియోజకవర్గంలో  పరిష్కరించవలసిన సమస్యలు, అభివృద్ధి పనుల పురోగతి గురించి చర్చిస్తారు. వారితో సమావేశం అయ్యే ముందు ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళి క్షేత్ర స్థాయిలో పనుల పురోగతిని స్వయంగా పరిశీలించడం, స్థానిక సమస్యల గురించి తెలుసుకొనే ప్రయత్నం చేయడం చాలా మంచి ఆలోచనే అని చెప్పవచ్చు. తద్వారా తన నియోజకవర్గంలో జరుగుతున్న పనుల గురించి మరింత అవగాహన ఏర్పరచుకొని, వాటిపై అధికారులతో సాధికారికంగా చర్చించవచ్చు.