నారా లోకేష్ అలా ఎంట్రీ ఇస్తున్నారు

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను మంత్రివర్గంలో చేరికపై గత ఏడాదిన్నరగా మీడియాలో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆయన చేరిక ఇప్పుడు ఖరారు అయ్యింది. ఏపి సిఎం చంద్రబాబు నాయుడు నివాసంలో నిన్న పార్టీ పోలిట్ బ్యూరో సమావేశం జరిగింది. త్వరలో జరుగబోతున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో లోకేష్ ను పోటీ చేయించాలనే తెదేపా నేతల ప్రతిపాదనకు చంద్రబాబు అంగీకరించారు. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ సీటుకు లోకేష్ కు కేటాయించాలని నిర్ణయం అయ్యింది కనుక అయన ఎంపిక లాంచనప్రాయమేనని చెప్పవచ్చు. లోకేష్ శాసనమండలి సభ్యుడిగా ఎన్నికవడం ఖరారైంది కనుక మంత్రి పదవి చేపట్టడం కూడా ఖాయమైనట్లే చెప్పవచ్చు. ఏపిలో మొత్తం 9 ఎమ్మెల్సీ సీట్లున్నాయి. వాటికి ఫిబ్రవరి 28న నోటిఫికేషన్ వెలువడబోతోంది.