ఉత్తరప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో నేడు 5వ దశ పోలింగ్ కొద్దిసేపటి క్రితమే మొదలైంది. 11 జిల్లాలలో మొత్తం 51 నియోజకవర్గాలకు నేడు పోలింగ్ జరుగుతోంది. వీటి కోసం 608 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. వారిలో 40 మంది మహిళా అభ్యర్దులున్నారు. అమేధీ నియోజక వర్గం నుంచి అత్యధికంగా 26 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు.
ఈ 51 నియోజక వర్గాలలో మొత్తం 18171826 మంది ఓటర్లున్నారు. వారిలో పురుషులు: 97,91,140 మంది, మహిళలు 83,79,745 మంది ఉన్నారు. ఈరోజు పోలింగ్ కోసం మొత్తం 18,822 పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేయబడ్డాయి.
ఏడు దశలలో సాగుతున్న ఈ ఎన్నికల ప్రక్రియలో మార్చి4న 49స్థానాలకు, చివరిగా మార్చి 8న 40 స్థానాలకు పోలింగ్ తో ముగుస్తుంది.
మణిపూర్ శాసనసభ ఎన్నికలు 2 దశలలో నిర్వహించబడతాయి మార్చి4న 49స్థానాలకు, మార్చి 8న 22 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. మార్చి 11న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి.