తెలంగాణా వీఆర్ఏలకు శుభవార్త

తెలంగాణా వీఆర్ఏలకు శుభవార్త. వారి జీతాలు నెలకు రూ.4,000 పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం నిర్ణయించారు. ప్రస్తుతం వారికి నెలకు రూ.6,500 మాత్రమే పొందుతున్నారు. ఇక నుంచి అది నెలకు రూ.10,500 అవుతుంది. అదనంగా తెలంగాణా ఇంక్రిమెంట్ పేరిట మరో రూ.200 కూడా పొందుతారు. పెంచిన ఈ జీతాలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తాయి. ఇక వారసత్వంగా ఈ ఉద్యోగాలు చేస్తున్న వీఆర్ఏలకు గ్రామాలలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కూడా మంజూరు చేశారు. దీని వలన రాష్ట్రంలో 19,345 మంది వీఆర్ఏలకు ప్రయోజనం చేకూరబోతోంది. వీఆర్ఓ ఉద్యోగాలలో వీఆర్ఏలకు 30 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించారు. కాంట్రాక్టు పద్దతిలో సేవలు అందిస్తున్న వీఆర్ఏలను కూడా క్రమబద్దీకరించాలని నిర్ణయించారు. ఈ ఆదేశాలను తక్షణమే అమలుచేయవలసిందిగా అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.