కేసీఆర్ మొక్కుల చెల్లింపు

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు మహాశివరాత్రి సందర్భంగా మేడ్చల్ జిల్లాలో కీసర రామలింగేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు చేస్తారు. తరువాత మహబూబాబాద్ జిల్లాలోని కురవి వీరభద్రస్వామివారికి బంగారు మీసాలు మొక్కు చెల్లించుకొంటారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటయితే స్వామివారికి బంగారు మీసాలు చేయించి ఇస్తానని కేసీఆర్ ఉద్యమ సమయంలో మొక్కుకొన్నారు. నేడు ఆ మొక్కు తీర్చుకొబోతున్నారు. మూడు రోజుల క్రితమే ఆయన తిరుమల వెంకన్న దర్శనం చేసుకొని ఆ స్వామివారికి రూ.5 కోట్లు విలువగల బంగారు ఆభరణాలు మొక్కు చెల్లించుకొన్న సంగతి అందరికీ తెలిసిందే.