ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో నేడు 4వ దశ పోలింగ్ మొదలైంది. ఈరోజు పోలింగ్ జరుగుతున్న 53 స్థానాలకు మొత్తం 680 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. అలహాబాద్ నుంచి అత్యధికంగా 26 మంది అభ్యర్ధులు పోటీ పడుతుంటే, ఖాగా, కుందా నియోజకవర్గాల నుంచి ఆరుగురు చొప్పున పోటీ పడుతున్నారు. అలహాబాద్, రాయ్ బరేలీ, ప్రతాప్ ఘడ్ తదితర 12 జిల్లాలలో ఈ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో మొత్తం 1.85 కోట్లు మంది ఓటర్లున్నారు. వారిలో పురుషులు 1.31 కోట్లు, మహిలు 84.50 లక్షల మంది ఉన్నారు. ఈరోజు జరుగుతున్న పోలింగ్ కోసం ఎన్నికల సంఘం మొత్తం 19,487 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది.
మళ్ళీ మళ్ళీ ఫిబ్రవరి 27న 52 స్థానాలకు, మార్చి4న 49స్థానాలకు, చివరిగా మార్చి8న 40 స్థానాలకు జరిగే పోలింగ్ తో ఈ ఎన్నికలు పూర్తవుతాయి. మార్చి 11న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి.